తాతపూడి నతానియేలు ఆధ్వర్యంలో 20వేలు ఆర్ధిక సహాయం అందజేత
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం కొండకుదురు గ్రామంలో బిబిఎస్ అధ్యక్షుడు తాతపూడి నతానియేలు ఆధ్వర్యంలో అకాల మరణం చెందిన సువార్తికుని కుటుంబానికి 20వేల రూపాయలు చెక్కు అందించి బిబిఎస్ దాతృత్వాన్ని అనేక మందికి మార్గదర్శకులుగా చాటి చెప్పారు. క్రైస్తవ మత బోధకులు…ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘానికి బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ అని పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ గ్రామాల్లో క్రీస్తు సంఘంలో దైవ సేవ చేస్తున్న పాస్టర్లలో ఎవరైనా అకాల మరణం చెందితే ఆ పాస్టర్ కుటుంబానికి బిబిఎస్ గ్రాడ్యుయేట్ తమకు తోచిన సహాయాన్ని అర్ధికంగా అందజేస్తుంది.ఈనేపధ్యంలోనే
అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చెందిన ఎల్లే కృపావరం రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం క్రీస్తు సంఘంలో దైవసేవకులుగా సేవచేస్తున్నారు.అయితే గతకొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న దైవసేవకుడు కృపావరం ఇటీవల మరణించారు. మరణించిన సేవకుని కుటుంబానికి ఎవ్వరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ తలో కొంత నగదును పోగుచేసి అధ్యక్షుడు తాతపూడి నతానియేలు ఆద్వర్యంలో శుక్రవారం మృతుడు కృపావరం భార్య ప్రభావతికి తన స్వగ్రామం కొండుకుదురులో రూ.20 వేల చెక్కును అందజేశారు. ఈకార్యక్రమంలో సెక్రటరీ గల్లా విజయకుమార్ , చిర్రా ప్రసాద్ , ఉపాధ్యక్షులు పైడివళ్ళ రాజారావు , మోకాటి లాజర్ గౌరవ అధ్యక్షులు సవరపు డేవిడ్ కింగ్ , చంద్రమళ్ళ సుగుణారావు , నిడిగట్ల శ్యామ్ సన్ రాజు తదితరులు పాల్గొన్నారు