Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లాతల్లి విజయం కోసం తనయుడి ప్రచారం

తల్లి విజయం కోసం తనయుడి ప్రచారం

ఆంధ్రన్యూస్ : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ఆశయ సాధనలో భాగంగా నియోజక వర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గా పోటీ చేయుచున్న వరుపుల సత్య ప్రభ రాజా గెలుపు కోసం తనయుడు వరుపుల వారసుడు. నియోజక వర్గ తెలుగు దేశం పార్టీ యువ నాయకులు , యువకిషోరము సాయి తర్షిత్* రౌతులపూడి మండలం, బంగారయ్యపేట లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. టిడిపి శ్రేణులు సాయి తర్షిత్ ఘన స్వాగతం పలికారు… అడుగడుగున మహిళలు వారింటికి స్వాగతం పలుకుతూ, పూలు చల్లుతూ, హారతులు ఇస్తూ. బ్రహ్మరథం పట్టారు.. అమ్మని గెలిపించే బాధ్యత మాది అంటూ తర్షిత్ కి హామీ ఇచ్చారు…. యువకులు తర్షిత్ తో ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు… యువకులు అంతా రాజన్న వారసుడు వచ్చాడు అంటూ నినాదాలు తో ప్రచారం హోరెత్తించారు… ప్రచారంలో భాగంగా తర్షిత్ కర పత్రాలు పంచుతూ మ్యానిఫెస్టోలో అంశాలు ప్రచారం చేస్తూ అమ్మని గెలిపించాలని, సైకిల్ కి ఓటు వేయాలి అని ఓటర్లను కోరారు… స్థానిక టిడిపి నాయకులు గుండ్రాజు దివాణం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపి, జనసేన, బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments