
(కర్నూలు ఆంధ్రన్యూస్)నిర్మల్ జిల్లాలోని పరిమండల్ గ్రామానికి చెందిన గొర్రె రాజేంధర్ అనే యువకుడు 2023లో ఇంటర్మీడియట్ చదువులు పూర్తి చేసిన తర్వాత స్థానిక ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లాడు.అక్కడికి వెళ్లిన తర్వాత అతని ఒక అంగిడిలో లో పరిశుభ్ర పనిచేస్తూ నెలకు 1,000 దిర్హం (రూ. 23,470.) సంపాదిస్తూ జీవనం కొనసాగించేవాడు.అయితే ఒక ఏడాది తర్వాత,రాజేంధర్‌కు తెలియకుండానే అతని ఇంటి నంబర్‌తో లింక్‌చేయబడి ఉన్న బ్యాంకు ఖాతాలోకి ఉంటూ ఉండనే దాదాపు 2,000 దిర్హామ్‌లు అంటే భారతదేశంలో చలమనే అవుతున్నా నగదు లో రూ. 46,941 ఆ ఖాతాలోకి రావడం ద్వారా.దీని తర్వాత అతని యజమాని రాజేంధర్‌ను పనిలోనుంచి తీసివేశారు.అయితే అతని ఖాతాలోకి అనధికారికంగా నిధులు చేరిపోవడంతో స్థానిక పోలీసులు దీనిపై తనిఖీలు చేపట్టారు.అయితే యజమమాని తనను ఉద్యోగంలోంచి తొలగించడంతో రాజేంధర్ భారతదేశానికి తిరిగి రావడానికి నాన్నా అవస్థలు పడుతున్నాడు.కానీ విమానాశ్రయంలోని అతని బ్యాంక్ ఖాతాకు సంబంధించిన లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు రాజేంధర్‌ను దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక రాజేందర్ అల్ ఖుసైస్‌లో ఉన్న తన స్నేహితులతో ఉంటూ.తన సమస్యను పరిష్కరించచుకోవడానిక ప్రయత్నాలు మొదటు పెట్టాడు.ఇందులో భాగంగా క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్,భారత రాయబార కార్యాలయం చూట్టూ తిరుగుతూనే ఉన్నాడు.తన పరిస్థితిని రాజేంధర్ తల్లిదండ్రులకు తెలియజేయడంతో వాళ్లు ఇటీవల నిర్మల్ జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసి, గల్ఫ్ వలసదారుల సంక్షేమం కోసం తెలంగాణ ఎన్నారై సలహా కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల నుండి సహాయం కోరాడు.తమ కుమారుడు ను ఎలాగైనా తిరిగి రప్పించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు.ఈ సమస్యను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జిఏడి)తో సహా సంబంధిత రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించి ఆయన మాట్లాడుతూ సరైన ఉపాధి పనులు లేకుండా ఎవరూ విదేశాలకు వెళ్ళకూడదని సూచించారు.గల్ఫ్ వలసదారులు ఆన్‌లైన్ మోసాలు,సైబర్ మోసం మరియు క్రెడిట్ కార్డ్ దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.



