
డుంబ్రిగూడ లో రాయితీ రాజ్మా విత్తనాల పంపిణీ
ఆంధ్ర న్యూస్ :-డుంబ్రిగుడ
మండల కేంద్రంలో గురువారం 90% రాయితీ రాజ్మా విత్తనాలను ఎంపీపీ ఈశ్వరి, జడ్పిటిసి జానకమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి నంద్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ….. రాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలో 355 క్వింటాలు రాయితీ రాజ్మా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కావలసిన రైతులు భూమి పట్టా, ఆధార్ జిరాక్స్ లతో దగ్గర్లోని రైతు సేవ కేంద్రాల వద్దకు వెళ్లాలని ఎంఏఓ వాసుదేవరావు సూచించారు. కార్యక్రమంలో టిడిపి మండల మాజీ అధ్యక్షులు టి సుబ్బారావు, టి ఎన్ టి యు కార్యదర్శి ఎం స్వామి, పోతంగి పంచాయితీ సర్పంచ్ వెంకట్రావు, మాజీ ఎంపీపీ కే, దన్నే రావు తదితరులు పాల్గొన్నారు.



