
డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కర్నూల్ లోని సాయి వసంత్ కాంప్లెక్స్ లో జరిగిన సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పగడాల ఆనంద్ బాబు, రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కటారుకొండ సాయికుమార్, నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయుడు, డీఎస్సీ అభ్యర్థులు నటరాజ్, చంద్రశేఖర్, తేజ, నాయక్, మోహన్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
“ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ -2025 లో పోస్ట్ ప్రాధాన్యత ఎంపిక ను పరిక్షలకు ముందే ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో దాదాపు 20 వేల మంది మొదట స్కూల్ గ్రేట్ టీచర్ ఎంపిక చేసుకుని ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ లను ఎంపిక చేసుకోవడం జరిగింది. మరికొంత మంది స్కూల్ గ్రేడ్ టీచర్ ఎంపిక చేసుకోవడం జరిగింది.గత డీఎస్సీ లో అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా మొదట హయ్యర్ కేటగిరి భర్తీ చేసి తర్వాత లోయర్ కేటగిరి పోస్టులు భర్తీ చేసేవారు. మన రాష్ట్రంలో కూడా గత 30 సంవత్సరాలుగా అదే విధానాన్ని కొనసాగించారు.అయితే ఈసారి ఆవిధానానికి భిన్నంగా ఒకే సారి అన్నీ పోస్టులను భర్తీచేస్తామని అధికారులు పత్రికల ద్వారా తెలియచేసారు.అలా భర్తీ చేస్తే పోస్ట్ ప్రాధాన్యత అవకాశం ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది అర్హత ఉన్నప్పటికీ ఉన్నత స్థాయి పోస్ట్ ను కోల్పోవల్సి వస్తుంది.ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే పోస్ట్ ప్రాధాన్యత విధానాన్ని ఎప్పటినుంచో అమలుచేస్తూ వస్తున్నాయి.కావున ఈ డిస్సీ లో కూడా మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాతనే పోస్ట్ ప్రాధాన్యత అవకాశాన్ని అభ్యర్థులకే ఇవ్వాలని దానివల్ల అర్హత కలిగిన అభ్యర్థులు హై క్యాడర్ పోస్టులను కోల్పోకుండా ఉంటారని ఈ విషయంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.ఈ విషయంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చొరవ తీసుకుని డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని వారు తెలిపారు.



