(ఆంధ్ర న్యూస్) కర్నూలు సిటీలో ప్రసున్న లా కాలేజీ నందు డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి 66 వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి పటానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి,యువజన సంఘం, వర్కింగ్ ప్రెసిడెంట్
షేక్.రియాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ప్రసున్న లా కాలేజీ ప్రిన్సిపాల్ శివాజీ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసున్న లా కాలేజీ ప్రిన్సిపాల్ శివాజీ రావు,బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్ధి యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్. రియాజ్,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ,జిల్లా నాయకులు రాజసికిందర్ మాట్లాడుతూ
డాక్టర్ బి.ర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాని నిర్మించి పేద,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని,ప్రపంచ దేశాలలొనే గొప్ప చరిత్ర కలిగిన మహానుభావుడు, మేధావి అంబేద్కర్ గారని యువత అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని, అంబేద్కర్ గారి ఆశయాలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని,అంబేద్కర్ గారి మరణాంతరo భారత దేశ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇచ్చి గౌరవించిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఉస్మాన్,రియాజ్,నరసింహ,అస్మా,నందిని,మరియు విద్యార్థి, విద్యార్థినిలు,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు
డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ గారి 66 వర్ధంతి సందర్భంగా కర్నూలులో ప్రసున్న లా కాలేజీ నందు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి,యువజన సంఘం.
RELATED ARTICLES