
ఆంధ్రన్యూస్ : విజయవాడ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నందు భారతరత్న రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఈరోజు 51 వ డివిజన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యులు మరుపిళ్ళ రాజేష్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు మరుపిళ్ళ రాజేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ సేవలు మరువలేనివని ఆయన ఆశయ సాధన కోసం వారి అడుగుజాడల్లో నేటి యువత అంతా నడవాలని తెలియజేశారు, అలాగే నిన్న విజయవాడ లో జరిగిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద మరియు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పై జరిగిన దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్రంలో మీకోసం సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అసాంఘిక శక్తులతో అత్యంత హేయంగా దాడి చేయించడం చాలా బాధాకరమైన విషయం అని ,ఎన్ని దాడులు చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన కూడా ప్రజాదరణ జగనన్నకు ఇంతకింతకు పెరుగుతుందే గాని తగ్గదని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం ముందు కూటమి కొట్టుకుపోతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ సభ్యులు బెవర ఉమామహేశ్వర రావు బీసీ సభ్యులు గోగుల నాగరాజు రాష్ట్ర నగరాల యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ బాయన బెనర్జీ సుబ్రమణ్య స్వామి గుడి దేవస్థానం ధర్మకర్త మరుపిళ్ళ తిలక్,నగరాల యువజన సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ పిళ్ళా ఆనంద్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ పోతిన విజయ్ కుమార్ వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



