మెట్టజ్యోతి కిర్లంపూడి కాకినాడ జిల్లా : దేశ ప్రధాని నరేంద్ర మోడీ దారిధ్యo నిర్మూలనకు కంకణబద్దులై ప్రవేశపెట్టిన ఆర్థిక సమీలీకృత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గ్రామీణ ప్రజలందరూ సంసిద్ధo కావాలని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ పర్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కిర్లంపూడి మండలం శృంగరాయని పాలెం గ్రామంలో గెద్దనాపల్లి కీ చెందిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎమ్. కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫైనాన్షియల్ ఇంక్లోజస్ సమిలీకృత కార్యక్రమంలో ఆర్.ఎమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఖాతాదారులకు పై విధంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఆర్థిక పరిపుష్టిని సాధించేందుకు అందిస్తున్న సంక్షేమాలను ప్రతి ఒక్క ఖాతాదారునకు చెందేలా తమ బ్రాంచ్ల యందు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆ నేపథ్యంలోనే ప్రధాని పిలిపినందుకొని 2014 నుండి జన్ ధన్ అకౌంట్లను తెరవడం జరుగుతుందని వివరించారు. అకౌంట్లను తీసుకొని వారు ఎవరైనా ఉంటే తమ బ్రాంచ్ సిబ్బందిని సంప్రదించాలని ఆర్.ఎమ్ కోరారు. బ్యాంకు ఏదైనా తీసుకున్న లోన్లు డిపాజిట్లు సమానంగా ఉన్నప్పుడే అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా ఖాతాదారుల ప్రతి ఒక్కరు వారి దగ్గర ఏమాత్రం సొమ్ము ఉన్న ఇంట్లో కాకుండా బ్యాంకులో దాచుకునేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఖాతాదారులకు ఏ ప్రాణహాన్ని చోటుచేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో చక్కటి బీమా పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆ పథకాలన్నింటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన సూచించారు. అదేవిధంగా గెద్దానాపల్లి బ్రాంచ్ లో సిబ్బంది అందరూ చాలా చక్కగా సేవలందించడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే బ్యాంకు ఫైనాన్స్ ఉన్నతాధికారులు సూర్యనారాయణ, మజీద్ లు ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్టు చంటిబాబు, ఎంపీటీసీ సభ్యుడు గరగా గోవిందు, సచివాలయ సెక్రటరీ C.H జ్యోతి, వెల్ఫేర్ అసిస్టెంట్ అచ్చారావు, అలాగే గెద్దనాపల్లి బ్యాంకు మేనేజర్ ఎమ్. కృష్ణారావు, అసిస్టెంట్ మేనేజర్ వెంకట శివరామిరెడ్డి, క్యాషియర్ సతీష్, అటెండర్ మజీద్, ప్యూన్ శ్రీనివాస్ తదితర గ్రామస్తులు నూతన ఖాతాదారులు పాల్గొన్నారు.
జీరో అకౌంట్లు వేగవంతం-ఆర్.ఎమ్ P. శ్రీనివాస్
RELATED ARTICLES