
(కర్నూలు ఆంధ్రన్యూస్) ఐపిఎస్ వారు
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 104 ఫిర్యాదులు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి,పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన.జిల్లా ఎస్పీ.ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోకండి.పోటి పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి.డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పే వ్యక్తులను ఎవ్వరిని నమ్మవద్దు.మోసపోవద్దు.జిల్లా ఎస్పీ.కర్నూలు కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ వారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 104 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.తన కుమారుడు తన బాగోగులు చూడడం లేదని కర్నూలు,ఇందిరా గాంధీ నగర్ కు చెందిన రంగలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు.కర్నూలుకు చెందిన వీరస్వామి నా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.8 లక్షలు,5 తులాల బంగారం తీసుకొని మోసం చేశాడని కర్నూలు,రాధక్రిష్ణ వీధికి చెందిన వి.నాగరాజు ఫిర్యాదు చేశారు.కర్నూలుకు చెందిన హేపెప్సీబా సునీలా కరుణా సాగర్,ఎలిజెబెత్ లు పాస్టర్ లుగా పని చేస్తున్నారు.
మార్కెట్ మాస్టర్ అనే యాప్ లో V6 మేనేజర్లు గా పనిచేస్తున్నామని లక్షలలో డిపాజిట్ ఉందని,వాళ్ళు ఇవ్వకుంటే మేము ఇస్తామని,మీ డబ్బులు ఎక్కడికి పోవూ నమ్మండి,డబ్బులు బాగా వస్తాయని ఎక్కువ మందిని ఈ యాప్ లో చేర్పిస్తే వాళ్లతో పాటు మీకు కూడా రెట్టింపు కమిషన్ లు,బోనస్ లు వస్తాయని నమ్మించారు.ఎక్కువగా అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని గ్రూపు లు చేసి ప్రతి ఆదివారం జూమ్ మీటింగ్ తీసుకుంటూ 578 మంది నుండి రూ.4 కోట్ల వరకు మోసం చేసి తీసుకున్నారు.డబ్బులు ఇవ్వకుండా మార్కెట్ మాస్టర్ అనే యాప్ బ్లాక్ అయిందని,మీతో పాటు మమ్మల్ని మోసం చేశారని నష్టపోయామని మమ్మల్ని మోసం చేస్తున్నారని కర్నూలుకు చెందిన కళ్యాణి,గౌతమి,రాజేశ్వరి,పద్మ,పద్మావతి,నాగరాజు,
విజయభాస్కర్,తాయన్న పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.నా పొలానికి రస్తా వదలకుండా రైతు గొల్ల నాగప్ప అడ్డుపడుతున్నాడని రస్తా విషయంలో తనకు న్యాయం చేయాలని కోడుమూరు మండలం,వర్కూరు గ్రామానికి చెందిన జి.రాముడు ఫిర్యాదు చేశారు.వెల్దుర్తికి చెందిన ప్రశాంత్ బాబు ఢిల్లిలో అనురాగ్ అనే వ్యక్తితో తనకు పరిచయాలు ఉన్నాయని,రైల్వే డిపార్ట్ మెంట్ లో కేడర్ కోర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అందుకోసం ఇంటర్వూ ఉంటుందని రూ.12 లక్షల 50 వేలు తీసుకొని నన్ను మోసం చేశాడని కర్నూలు,శ్రీనగర్ కాలనీకి చెందిన రవిబాబు ఫిర్యాదు చేశారు.పంచలింగాల దగ్గర ఉన్న నా వ్యవసాయ భూమిలో ఫారెస్టు వారు గాని లేదా నా అనుమతి గానీ లేకుండా 10 టేకు చెట్లను జెసిబితో ఎలక్ట్రిసిటి డిపార్ట్ మెంట్ వారు తొలగించారని వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు మండలం,పంచలింగాల గ్రామం కు చెందిన మాధవరాజు ఫిర్యాదు చేశారు.బి.టెక్ చేసిన తనకు హైదరాబాద్ కు చెందిన షణ్ముక్ సుదర్శన్ అనే వ్యక్తి కన్సల్టెన్సీ పేరుతో గచ్చిబౌలిలో ఐటి సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.4 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు,జోహారాపురం కు చెందిన గుణశేఖర్ ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి,బాధితులకు న్యాయం చేస్తామని,సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వారు హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా,సీఐ లు పాల్గొన్నారు.



