ఏలేశ్వరం: రాష్ట్ర ఏపీడబ్ల్యూజేఎఫ్ పిలుపుమేరకు ఏలేశ్వరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం “జర్నలిస్టుల కోర్కెల దినం” పిలుపులో ఆందోళన నిర్వహించారు. ఆందోళనలో భాగంగా స్థానిక బాలాజీ సౌక్ సెంటర్లో ధర్నా నిర్వహించి ఏలేశ్వరం తాసిల్దార్ కార్యాలయంకు చేరుకుని నిరసన తెలియజేసి, తాసిల్దార్ ఏ విశ్వనాథ శాస్త్రికి 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కే వి వి ఎస్ పట్నాయక్, ఏపీడబ్ల్యూజేఎఫ్ పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడు ఎండి అధికార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికలను తీర్చాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు శిడగం మాధవ, ఉపాధ్యక్షులు పత్తి వాసు, బి నానాజీ, ఎస్ మల్లికార్జున్, మువ్వల శ్రీనివాస్, దొడ్డి శ్రీనివాసరావు, మధు, పారేపల్లి గంగా ప్రసాద్, వాగు రమేష్, కే దుర్గా శ్రీనివాస్, పి శివరాం, ఎస్.కె ఇమ్రాన్, వక్కలంక ప్రసాద్, పారేపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.