కౌతాళం డిసెంబర్ 05 ఆంధ్రన్యూస్ కౌతాళం మండలంలోని ఉరుకుంద గ్రామంలో ఇదేంకర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలోవైయస్సార్ పార్టీ నాయకులకు రాయలసీమ ప్రాంతం ఇపుడు గుర్తుకు వచ్చిందా మీకు మూడున్నర సంవత్సరంలో రాయలసీమ కు ఏమి చేశారో జగన్ మోహన్ రెడ్డి సమాధానము చెప్పాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు వారు కౌతాళం మండలం లోని ఉరుకుందు గ్రామంలో ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు ఎన్నికలలో వైయస్సార్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఇపుడు ప్రజలను మోసము చేసి అబద్ధపు మాటలు చెపుతూ కాలయాపన చేయడం తప్ప చేసింది ఏమి లేదు అని నిత్యావసర వస్తువులు నుండి అన్ని రకాల వస్తువులు రెట్లు పెంచి ప్రజలపై భారం మోపి తుగ్లక్ పాలన కొనసాగిస్తూ రాక్షస పాలన నడుపుతున్న పార్టీ వైయస్సార్ పార్టీ అని పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తుంది ప్రజలు సమస్యలు పరిష్కారం చేస్తాం అని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, కురుగోడు,సర్పంచ్ అధికార ప్రతినిధి సురేంద్ర, డమ్మలదిన్ని రమేష్ గౌడ్, బాపురం వెంకటరెడ్డి,సైకిల్ షాపు నరసింహులు,ఒబుళపురం నరసింహులు, టి యన్ యస్ ఎఫ్ రామచంద్ర, దుద్ది ఉసేని,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823