కౌతాళం (ఆంధ్రన్యూస్)
మంత్రాలయం నియోజక వర్గంలో కౌతాళం మండల పరిధిలోని రౌడురు గ్రామంలోని యూనిట్ ఇంచార్జి,మండల నాయకులు అద్యక్షతన నిర్వహించారు.రౌడురు గ్రామంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, మరియు, ప్రభుత్వ వైఫల్యాలను నిత్యావసర ధరలు, రాజధాని రాజకీయాలు,ప్రభుత్వ ఉద్యోగ కష్టాలు,అభివృది కుంటుపడిన రాష్ట్రముగా ఆంధ్ర రాష్ట్రము మరియు కక్ష్యపాత రాజకీయాలు గురించి ప్రజలకు తెలియజేస్తూ గ్రామ ప్రజలు పడుతున్న కష్టాలు మరియు వారి సమస్య తెలుసుకున్నారు. మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకుడు ఉలిగాయ్య మరియు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వైయస్సార్ ప్రభుత్వం వచ్చే మూడున్నర సంవత్సరాల అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను నవరత్నాలు పథకాలతో ప్రజలను నట్టేట ముంచారు.నిత్యవసర సరుకులు పెంచుకుంటూ అదేవిధంగా నిజమైన నిరుపేదలు హరత ఉన్న నవరత్న పథకాలు తొలగింపు చేయడం చాలా సిగ్గుచేటు ఇలాంటి నీచ రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేదు నిరుపేదలను ఆదుకునే దేవుడు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ నారా చంద్రబాబునాయుడు రావాలి అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తాం అని గ్రామంలో ప్రజలు తెలియజేశారు.ఈ కార్యక్రమములో గ్రామ నాయకులు బుడదొడ్డి, శివ,చంద్ర,మబువాలీ, సిద్దప్ప హాల్వి రామలింగన్న, మరెప్పా,చంద్రన్న,లక్కే గోవిందు,కురువ నాగేష్, లక్కే మహంతేష్,నరసింహ,రంగా మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు తెలుగు యువత పాల్గొని జయప్రదం చేశారు.