మెట్టజ్యోతి, శంఖవరం : ప్రజలందరూ చట్టం దృష్టిలో సమానమని, చట్టపరమైన న్యాయపరమైన సమస్యలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు సహాయపడతాయని ప్రత్తిపాడు కోర్టు జడ్జ్ కాటం భాను తెలిపారు . మండలంలోని కత్తిపూడి గ్రామంలో గల పంచాయతీ నందు శనివారం ఉదయం సచివాలయ సిబ్బందికి, అంగనవాడి టీచర్లకు, అంగన్వాడి కార్యకర్తలకు, ఆశాలకు గ్రామ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జడ్జ్ కాటం భాను మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానం అని చిన్నచిన్న సమస్యలను కోర్టులో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని,309 ఆర్టికల్ ప్రకారం వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం నేరమని ముఖ్యంగా మహిళలు అందరూ కూడా న్యాయ వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చట్టంపై అవగాహన ఉండటంవల్ల న్యాయబద్ధంగా గెలుపొందచ్చని సూచించారు. ఈనెల 12వ తారీఖున ప్రత్తిపాడు కోర్టు పరిధిలో గల పెండింగ్ లో ఉన్న కేసుల యొక్క అర్జీ దారిలు అందరూ కూడా లోక్ అదాలత్ ద్వారా వారి యొక్క సమస్యలను పరిష్కరించు కోవచ్చని తెలిపారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది ఒక చక్కటి మార్గమని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బుగత శివ, కార్యదర్శి రాజాల చిట్టిబాబు, న్యాయవాదులు బత్తిన సింహాచలం, కూచి మంచి సూర్య ప్రకాష్, మల్లేశ్వరరావు, మండల కో ఆప్షన్ సభ్యులు గాబు కృష్ణ , ఉపసర్పంచ్ గౌతు నాగు, సెక్రటరీ శ్రీనివాసు, వీరబాబు, పెద్దాపురం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దడాల బాబ్జి, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, డ్వాక్రా యానిమేటర్లు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
చట్టంపై అవగాహన కలిగించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు
RELATED ARTICLES