
(ఆంధ్రన్యూస్ కర్నూలు)
కర్నూలు టూ టౌన్ సిఐను,పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించిన … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వారు.
2021 సంవత్సరంలో కర్నూలు,బంగారు పేట లో రోడ్డు వేసే సమయంలో జరిగిన ఘర్షణ కేసులో అప్పటి కర్నూలు టు టౌన్ సిఐకి,సిబ్బందికి గాయాలు కావడానికి కారణం అయిన విషయంలో 7 మంది నిందితులకు (5 మంది మహిళలు,ఇద్దరు పురుషలు) 5 సంవత్సరాల జైలు శిక్ష,ఒక్కొక్కరికి రూ. 2 వేల జరిమానా విధిస్తూ కర్నూలు అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దివాకర్ బుధవారం తీర్పు వెలువరించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.నిందితులు…
1) లక్ష్మీ (35) కర్నూలు,బంగారుపేట ,
2) నీలిశికారి బెల్కి (35) కర్నూలు,బంగారుపేట,
3) ఎన్.నరసింహులు (21)బాపుజినగర్,వడ్డేగిరి కర్నూలు. 4) నీలిశికారి సుగుణ(45),కర్నూలు,బంగారుపేట.5) ప్రసాద్ (20),కర్నూలు,బంగారుపేట 6) నీలిశికారి నాగమణి (29) కర్నూలు,బంగారుపేట 7) నీలిశికారి బెగిని (35) కర్నూలు,బంగారు పేట,అప్పటి సిఐ పార్థసారథి రెడ్డి పిర్యాదు మేరకు కర్నూలు టు టౌన్ పియస్ క్రైమ్ నెంబర్ 461/ 2021 U/s 147,148, 307, 332, 324 R/W 149 IPC క్రింద కర్నూలు టు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.అప్పటి టూ టౌన్ సిఐ పార్థసారథిరెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టి,కేసుకు సంబందించిన అన్ని ఆధారాలను,సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు.అన్ని కోణాల్లో విచారించిన కర్నూలు అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దివాకర్ 7 మంది నిందితులకు 5 సంవత్సరాల జైలు శిక్ష,ఒక్కొక్కరికి రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.స్పెషల్ పిపిలు,దర్యాప్తు అధికారులు,కేసులో కీలక తీర్పు వచ్చేలా పని చేసిన ప్రస్తుత కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు,కోర్టు హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్,కానిస్టేబుల్ రామకృష్ణను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వారు ప్రత్యేకంగా అభినందించారు.



