
మొలకలచెరువు, ఆంధ్రన్యూస్ : తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువు మండల కేంద్రంలోని వైసీపీ మండల అధ్యక్షులు మాధవరెడ్డి, జడ్పిటిసి సభ్యులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ గతంలో వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి గుర్తు చేశారు. అంతేకాకుండా నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని అదేవిధంగా మహాజన అనేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువలేదని అన్నారు. పార్టీకి కార్యకర్తల కీలకమని, రాబోయే రోజుల్లో వచ్చేది. వైసీపీ ప్రభుత్వమేనని కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు రాంబాబు నాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి, రవి శేఖర్ రెడ్డి, రహమత్ బీ, ఎంపీటీసీలు లక్ష్మి, చాంద్ బాషా, వైసిపి నాయకులు విశ్వనాధ్, కులదీప్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు….



