Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లాఘనంగా పర్వత 7వ వర్ధంతి వేడుకలు

ఘనంగా పర్వత 7వ వర్ధంతి వేడుకలు

ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడు పర్వత చిట్టిబాబు

మెట్టజ్యోతి : శంఖవరం. దివంగత నేత మాజీ శాసనసభ్యుడు టిడిపి జిల్లా అధ్యక్షుడు పర్వత సత్యనారాయణ మూర్తి(చిట్టిబాబు) నిరంతరం ప్రజల మద్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పోరాడే వారని ప్రజా హృదయాల్లో చిరస్మరణీయ వ్యక్తి అని చిట్టిబాబు కుమార్తె దుర్గాదేవి అన్నారు.చిట్టిబాబు వర్ధంతిని పురష్కరించుకుని మండలంలోని కత్తిపూడి సీతారామ కళాశాల యందు చిట్టిబాబు చిత్ర పటానికి ఆయన కుమార్తె దుర్గాదేవి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తన తండ్రి చిట్టిబాబు నిరంతరం ప్రజల కోసమే పోరాడే వారని నియోజకవర్గంలో ఎవరకి ఏ సమస్య వచ్చిన తమ సమస్య గా తీసుకుని వెంటనే పరిష్కారానికి కృషి చేసే వారని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి నాన్న చిట్టిబాబు అని నేటికి ఆయన చేసిన సేవలు నియోజక వర్గం అంతటా వ్యాపించి ఉన్నాయి అని కొనియాడారు. టి ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్నా శివ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి పర్వత కుటుంభం ఎప్పడూ కృషి చేస్తూనే వచ్చిందని శాశన సభ్యుని స్ధాయి నుండి జిల్లా అధ్యక్ష పదవి వరకు ఎదిగిన చిట్టిబాబు లేక పోవడం ప్రజలు జీర్ణించుకోలేనిది అని కల్మషం లేని వ్యక్తిగా నిస్వార్థ నాయకుడు గా ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి చిట్టిబాబు అని నిరంతరం ప్రజా శ్రేయస్సే ధ్యేయం గా కృషి చేసే వారని తెలిపారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో పర్వత సురేష్, మేకల కృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ వీరబాబు, అక్క రావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments