Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedగొల్లలమామిడాడ లో ఘనంగా అటల్ బిహారీ వాజపేయి 100వ జయంతి వేడుకలు.

గొల్లలమామిడాడ లో ఘనంగా అటల్ బిహారీ వాజపేయి 100వ జయంతి వేడుకలు.

పెదపూడి, ఆంధ్రన్యూస్ : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో భారతీయ జనతా పార్టీ పెదపూడి మండల జి మామిడాడ బూత్ స్థాయిలో అటల్ బిహారీ వాజపేయి 100వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25 – 2018 ఆగస్టు 16 మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించారు, వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఇతను మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను కూడా నిర్వహించారు. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చిి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు డిసెంబర్ 25ను సుపరిపా లనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 2015 మార్చి 27 న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వాజపేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసారు.అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజపేయికి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజపేయి నివాసానికి తరలి వెళ్ళారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేడపాటి హరినారాయణరెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ మురముళ్ళ వెంకటరమణ ,మండల అధ్యక్షులు కాకి సత్యనారాయణ, కడిమి మురళీకృష్ణ, మేడపాటి వరప్రసాద్ రెడ్డి, చల్లారెడ్డి, సుధాకర్, కృష్ణారెడ్డి మరియు బూత్ కమిటీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం మార్కెట్లో అందరికీ స్వీట్స్ పంచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments