(కౌతాళం ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల లోని హాల్వి గ్రామములో ఎంపీపీ ఎస్ డబ్ల్యూ స్కూల్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూన్న , కనీస జాగ్రత్తలు లేకుండా, బాధ్యత లేని యాజమాన్యం, మరియు కాంట్రాక్టర్ చేసిన తప్పు ఈరోజు హాల్వి గ్రామంలో చోటు చేసుకుంది. ఒక పక్కన కొత్త స్కూల్ ఉండి,దాని పక్కనే పాతబడిన స్కూల్ కూల్చడం లో నీర్లక్ష్యం వహిస్తూ కొత్త స్కూల్లో ఉన్న విద్యార్థుల మీద పడింది. అప్రమతమయిన ఉపాధ్యాయులు విద్యార్థులను కొంతవరకు బయటకి పంపించేశారు, కొంతమంది విద్యార్థులకు ప్రాణాపాయం లేకుండా గాయాలతో బయటపడ్డారు. వెంటనే విషయము తెలుసుకున్న స్థానిక నాయకులు ఉలిగయ్య సంఘటన స్థలని చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ వహించాలి. తగిన కాంటాక్టర్,యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్య్రమాములో హల్వి గ్రామ నాయకులు రారావి మల్లప్ప, కురువా నాగేష్, మౌలా , ఉషెని, సోము, ప్రకాశ్ మరియు లక్కే గోవిందు, మంతేష్, మణికంఠ, మూర్తి పాల్గొన్నారు…