
(కర్నూలు ఆంధ్రన్యూస్)
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం కేంద్రంలో గర్ల్స్ కళాశాల కు వసతి గృహం దగ్గరలోనే ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గర్ల్స్ కళాశాల విద్యార్థులు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ
ఆదోని పట్టణం లో ఉన్నటువంటి గర్ల్స్ కళాశాల ఆవరణలోనే వసతి గృహం ఏర్పాటు చేయాలని DSF విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము.అలాగే గర్ల్స్ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి హాస్టల్ కు వెళ్లాలంటే రాను పోను రెండు కిలోమీటర్ల అవుతుంది.కళాశాల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.గతంలో అధికారులకు తెలియజేసo.ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు.కనీసం ఇప్పటికైనా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే గర్ల్స్ కళాశాలకు దగ్గర్లోనే హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని,కోరుతున్నాము.అలాగే రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్ ద్వారా హాస్టల్స్ ను అభివృద్ధి చేస్తామని ప్రకటించడం సరికాదని DSF విద్యార్థి సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము.పి-4 తో ఇవి ప్రైవేట్ పరమవ్వడం కానీ మూసివేతకు గానీ దారి తీస్తాయని,అటువంటి ఆలోచనను విరమించుకోవాలని DSF విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నాము.ఇప్పటికే రాష్ట్రంలో వసతి గృహ సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి.ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రభుత్వ వసతి గృహాలను పి-4 ద్వారా అభివృద్ధి పేరుతో ప్రైవేట్ పరం చేస్తే పెద్ద ఎత్తున విద్యార్థులంతా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగేందుకు సిద్ధమవుతామని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా మరొక్కసారి అధికారులకు తెలియజేస్తున్నామని అన్నారు.



