కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం పరిధిలో ఉపరహాల్ గ్రామంలో రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం,కార్యక్రమంలో ఎమ్మెల్యే మై బాలనాగిరెడ్డి వైఎస్సార్సీపీ నేత మై ప్రదీప్ రెడ్డి, కౌతాళం మండలం ఉపరహాల్ గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శాసనసభ్యులు వై, బాలనాగిరెడ్డి వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి , ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న వీరికి ఏకం రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఏకం రెడ్డి ఎమ్మెల్కే, యువ నేత కు సన్మానం చేశారు. అనంతరం గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరును. గురించి లబ్దిదారులతో అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు బుక్ లెట్ ను అందజేసి పథకాల వివరాలను చదివి వినిపిస్తు ముందుకు సాగారు. గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఇంటి వద్ద పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేపట్టారు. గ్రామ సచివాలయం ఎంపీడీఓ యమ్మెర్వో సిబ్బంది పని తీరు, సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఏకం రెడ్డి, అత్రి గౌడ్. ఉరుకుంద ఈరన్న స్వామి టెస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజ్ గౌడ్. సుబ్బరాజు గౌడ్, బీమా యూత్ భీమేష్ గురు నాధ్ ఎంపీటీసీ అమరేష్ ఎంపీపీ బుజ్జి స్వామి కౌతాళం మైజర్ సర్పంచ్ పాల్ దినకర్ హై స్కూల్ చైర్మన్ వడ్డే రామన్న కార్యక్రమంలో ఎస్ ఐ నరేంద్ర కుమార్ రెడ్డి ఆయా శాఖ అధికారులు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823