(కర్నూలు ఆంధ్రన్యూస్)
అల్లూరి సీతారామరాజు జిల్లా
అరకు వేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ.అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి పాచిపెంట శాంత కుమారి ఆదేశాల మేరకు అరకు వ్యాలీ మండలము పెద్దలబుడు పంచాయతీ గంజాయి.గూడ.గ్రామములో. అరకు వ్యాలీ మండల అధ్యక్షుడు బోయి మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోయి మోహన్ రావు మాట్లాడుతూ గ్రామంలో నంది వలస. దుమ్మ గుడ్రి ముల్యాగలుగు చితం గొంది తోటవలస మరియు మజ్జివలససెల్ సిగ్నల్ సౌకర్యం లేకపోవడం వలన యువతకు వృద్ధులకు ఆన్లైన్లో ఈ కేవైసీ ఆధార్ కార్డు అప్డేట్ గాని 108 కి ఫోన్ చేయాలన్న చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ తక్షణమే . సెల్ సిగ్నల్ సౌకర్యం కల్పించాలని భాష వాలంటీర్లను ఆశ్రమ పాఠశాల హెల్త్ వాలంటీర్లు కు తక్షణమే రెవెన్యూ చేయాలని కేంద్రంలో బిజెపి ప్రభుత్వము రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిరుద్యోగులకు చాలా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయాలని స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని బ్యాక్ లాగ్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదలచేసి తక్షణమే న్యాయం చేయాలని నిరుద్యోగ యువతకోసం ఎంత దూరమైన పోరాట చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోయి మోహన్ రావు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అరకు వెళ్లి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు కోర్రా రఘురాం, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మాజీ.అద్దు సీనియర్ నాయకులు జంపరంగి వెంకట్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదల పండు కొర్ర భీమన్న, బోయి రఘు,కుర్ర దేవరాజు, జన్ని, సీతన్న రేగ నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు