కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలము లో పొదుపు మహిళలు గ్రూపులలో సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీలు కు పెరటి కోళ్లు పెంపకం ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు అందరికీ మంత్రాలయ శాసనసభ్యులు వై బాలనాగరెడ్డి ఆదేశాల మేరకు వెలుగు ఆఫీసు నందు పెరటి కోళ్లు 8 పిట్టలు మరియు 3 పుంజులు పంపిణీ జరుగును. కావున పొదుపు మహిళ గ్రూపు లిడర్ వారు మాత్రమే డిపాజిట్ నగదు -3150 రూపాయలు జమచేసి. వాటిని పొందాలని సూచించారు ఆసక్తి కలిగిన వారు ప్రతి ఒక్క మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పాల్ దినకర్ తెలిపారు. ఈ కార్యక్రమం నాయకులు దేశాయ్ ప్రహాల్లద్ ఆచారి ఆధ్వర్యంలో సర్పంచ్ పాల్ దినకర్ మరియు ఉప సర్పంచ్ సక్కరీ తిక్కయ వైస్ ఎంపీపీ బుజ్జీ స్వామి, హై స్కూలు ఛైర్మన్ వడ్డే రామన్న , మాజీ సర్పంచ్ అవతారం, వార్డు సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.