కౌతాళం ఆంధ్ర న్యూస్ అక్టోబర్ 30కౌతాళం మండల వ్యవసాయ శాఖ సమాచారము
కౌతాళం మండల రైతులు
పంటల నమోదు జాబితాను సరిచూసుకొనుటకు మీ మీ గ్రామాల రైతు భరోసా కేంద్రాల యందు ప్రదర్శించడమైనది కావున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు వేసిన పంటని సరిచూసుకొని వలసినదిగా కోరడమైనది ఈ జాబితాను సరిచూసుకొనుటకు సమయం రేపటితో ముగియనున్నది అనగా 31 అక్టోబర్ 2022. కావున ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. తదుపరి రెండవ తేదీలోగా ఈ జాబితాను ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపవలసి ఉన్నది కావున ఆ తరువాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్పులకు అవకాశం ఉండదు ఇది వ్యవసాయ శాఖ తరపున రైతులందరికీ తెలియజేయడమైనది.
కౌతాళం మండల ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823