Thursday, April 25, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాకౌతాళం మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వీఆర్వో, వీఆర్ఏ లపై అనుచిత...

కౌతాళం మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వీఆర్వో, వీఆర్ఏ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా గ్రామ సేవకులు ధర్నా చేయడం అయినది.

కౌతాళం (ఆంధ్రన్యూస్)

కౌతాళం మండల తాసిల్దార్ కార్యాలయం ముందు గ్రామ సేవకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శాసనసభ్యులు శ్రీ చెన్నకేశవ రెడ్డి నందవరం మండలం పులిచింతల గ్రామంలో భూహక్కుల పత్రం పంపిణీ సందర్భంగా వీఆర్వో, వీఆర్ఏ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమైనటువంటి విషయమని ధర్నా సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య అన్నారు. రెవెన్యూ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి గ్రామాల్లో మూల స్తంభమైనటువంటి వీఆర్వో, వీఆర్ఏలు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే వీఆర్వో ,వీఆర్ఏ లను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ వదులుతుందని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి అయినది కాదు. ఎమ్మెల్యే భూదందా విషయంలో వీరు సహకరించకపోవడం వల్ల, అవినీతిలో అందరికన్నా ముందు వరుసలో ఎమ్మెల్యే వాళ్ళు ఉంటున్నారు. మా గ్రామ సేవకులు ఎవరైనా అవినీతికి పాల్పడితే పై అధికారులకు తెలియజేసి మన్నించాల్సింది పోయి హద్దు మీరి మాట్లాడినారు.ఆయన మాటలను వెనుక్కు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సేవకుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఇప్పటికైనా మనసు మార్చుకుని గ్రామ సేవకులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమైనది.
ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామ సేవకుల జిల్లా ఉపాధ్యక్షులు ప్రహల్లాద డివిజన్ అధ్యక్షులు నాగరాజు మండల అధ్యక్ష కార్యదర్శులు వీరేష్ ,మనోహర గ్రామ సేవకులు మంగమ్మ, అయ్యమ్మ ,హనుమంతమ్మ, మారెప్ప, హనుమంతు ,గోపాల్ జటప్ప ,నర్సింలు ,ఈరన్న, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments