కౌతాళం డిసెంబర్ 05 ఆంధ్రన్యూస్ కౌతాళం మండల కేంద్రం నుంచి ఉరుకుంద వరకు ఒక కోటి పది లక్షల రూపాయలు శాంక్షన్ అయినది. దానికి రోడ్డు కాంట్రాక్టర్ నాసిరకంగా శుద్ధూగర్సు ఏసి కంకర కూడా సరిగా వేయకుండా పోవడం వల్ల రోడ్డు మొత్తం డ్యామేజ్ అయినదని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కే మల్లయ్య రాస్తో రోకో సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్టర్ ప్రయాణికుల భద్రత గురించి గానీ ,ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాల రోడ్డు అని తెలుసుకోకుండా ,పొలాలకు పోయే రోడ్డు మాదిరిగా పైపైన పనిచేసి వదిలేయడం వల్ల ఈరోజు కౌతాళం నుంచి ఉరుకుంద వరకు గుంతలు పడి రోడ్డు పూర్తిగా డామేజ్ అయినది. రోడ్డు విషయంలో ఎమ్మెల్యే మండల జనరల్ బాడీ సమావేశంలో ఆయన దృష్టికి తీసుకుపోవడమైనది. అయినా ఎమ్మెల్యే మాటను కూడా కాంట్రాక్టర్ బేకా తర్ చేసినారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వెంటనే స్పందించి ప్యాచ్ వర్క్ కాకుండా పూర్తిగా రోడ్డు వేసేటట్లు చేయాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం. కౌతాళంలో ఖాదర్ లింగస్వామి, ఉరుకుందులో ఈరన్న స్వామి, మంత్రాలయం లో రాఘవేంద్ర స్వామి మూ డు ప్రముఖ పుణ్యక్షేత్రాలు దేవాలయాలను దృష్టిలో ఉంచుకొని రోడ్డును బాగు చేయాలని లేని పక్షమున సిపిఎం పార్టీగా ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేయగలమని సిపిఎం పార్టీగా హెచ్చరించడం అయినది.ఈ రాస్తారోకో కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ మేలిగిరి ఈరన్న మండల నాయకులు ఉల్లిగయ్య, వెంకటేష్, కార్యకర్తలు వలి, వెంకన్న, గణేష్ ,వీరేష్ ,దొడ్డయ్య, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823