Thursday, April 18, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాకౌతాళం మండలంలో అధిక వర్షాలకు, తుపానులకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయలు...

కౌతాళం మండలంలో అధిక వర్షాలకు, తుపానులకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయలు ఇవ్వాలి.

కౌతాళం అక్టోబర్14 (ఆంధ్ర న్యూస్)
కౌతాళ మండలం పరిధిలో ఈ సంవత్సరం రైతు సంఘం నాయకులు అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు! వర్షాలు ముందుగానే రావడం వల్ల రైతులు పత్తి ,మిరప, వేరుశనగ, ఉల్లి ,తదితర పంటలు వేసినారు. మంచిగా పంటలు ఎదిగి కాపు వచ్చిన టైం లో అధిక వర్షాలు తుఫానుల వల్ల మండలంలో పంటలన్నీ దెబ్బతిని రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య అన్నారు.
మండలంలో అధిక వర్షాల వల్ల ఈ సంవత్సరం నది తీర గ్రామాలు పూర్తిగా పంటల దెబ్బతిని నష్టపోయినారు అదే రకంగా మండలంలో కౌతాళం, బదినహాల్ తోవి రౌడూర్ కాత్రికి, మలనహ ట్టి,కరణి చిరుతపల్లి గ్రామాల్లో రైతు సంఘం బృందం పరిశీలన చేయడమైనది. పత్తి కాయలు అధిక వర్షాల వల్ల కుళ్ళిపోయి కిందపడిపోయినాయి.. మిరప పూర్తిగా దెబ్బ తిన్నది రైతు ఎకరానికి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయినాడు.పత్తికిఎకరాకి30వేలరూపాయలు,మిరపకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం గా డిమాండ్ చేస్తున్నాం.
ఈ వరదల వల్ల నష్టపోయిన పొలాలను పరిశీలన చేయడానికి రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశులు, మేలి గిరి ఈరన్న, రైతు సంఘం నాయకులు ఉల్లిగయ్య, పామన్న,రామాంజనేయులవలి,లక్ష్మన్న ,ఈరన్న ,లసుమన్నతదితరులుపాల్గొన్నారు.

కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments