కౌతాళం నవంబర్ 07 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండలంలో ఈ సంవత్సరం మంచి వర్షాల వల్ల పంటలు బాగా పండినాయి. రైతుల కష్టాలు గట్టెకుతాయని అందరూ సంతోషపడ్డారు. అనుకోకుండా అకాల వర్షాలు వల్ల పత్తి ,మిరప ,వేరుశనగ, ఉల్లి తదితర చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. స్పందన కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర వర్మ వినతి పత్రం ఇవ్వడమైనది రైతులు ఎకరానికి 30, 40 వేలు రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారు.
ఈ సంవత్సరం మండలంలో అకిరా, తడాఖా ,ఆశ నకిలీ పత్తి విత్తనాలను కంపెనీ వాళ్ళు రైతులకు ఆశ కలిగించి దిగుబడి భావస్తుందని నమ్మించి మోసం చేసినారు. మండలంలో ఉప్పర హాలు, కుంటనహాలు, బదినేహాలు, తోవీ ,ఎరిగేరి ,కౌతాళం ,చూ డి గ్రామాలలో రైతు సంఘం బృందం పంటలను పరిశీలన చేయగా పత్తి పంట ఏపుగా పెరిగింది గాని, కాపు లేదు. మండలంలో నాలుగైదు వేలు ఎకరాలలో నకిలీ పత్తి విత్తనాలు వేసి మోసపోయినారు. అందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసిన కంపెనీలపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం గా డిమాండ్ చేస్తున్నాం.
కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి మేలిగిరి ఈరన్న, నాయకులు రామాంజనేయులు ,వీరేష్, సత్య ప్ప, ఆంజనేయులు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823