యానాం మెట్టజ్యోతి: యానాం నియోజకవర్గం కేంద్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ను యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కలిశారు. పుదుచ్చేరిలో అమలు కావాల్సిన వివిధ కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి సమీక్ష చేసేందుకు గాను ఆయన పుదుచ్చేరి విచ్చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రిని ఎమ్మెల్యే గొల్లపల్లి కలిసి యానాం ప్రాంతంలోని మత్స్యకారులు అందించాల్సిన వేట నష్టపరిహారం నిధులను వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పలు పథకాల అమలు పైన చర్చించారు. కేంద్రమంత్రిని శాలువాతో ఎమ్మెల్యే గొల్లపల్లి సత్కరించారు.
కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే గొల్లపల్లి
RELATED ARTICLES