కౌతాళం (ఆంధ్రన్యూస్)
కర్నూలు ఎమ్మిగనూరు నియోజకవర్గం
గోనెగండ్ల మండలం కున్నూరు గ్రామ మాజీ సర్పంచ్ కురువ సిద్ధప్పను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా కురుబ సంఘం జిల్లా కార్యదర్శి కురువ వీరేష్ అన్నారు.పూర్వ సిద్ధప్ప రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఆయనపై దాడి చేసి ప్రత్యర్థులు హత్య చేశారని ఇలాంటి హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారిని మరియు హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని లేకపోతే కురుబ సంఘం అధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు ఎక్కువ జరుగుతున్నాయని ఎవరైనా సరే కురువల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కురువ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ మరియు మండల రైతు సంఘం నాయకులు శివకుమార్ హనుమేశ్ బీరప్ప రమేష్ దేవేంద్ర తదితరులు
పాల్గొన్నారు.
కౌతాళ మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823