Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లా*కిర్లంపూడిలో ఘనంగా 137వ ప్రపంచ కార్మికుల దినోత్సవం

*కిర్లంపూడిలో ఘనంగా 137వ ప్రపంచ కార్మికుల దినోత్సవం

ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వై. జ్యోతిబాబు కిర్లంపూడి,

మే1సోమవారం: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల కేంద్రంలో 137వ ప్రపంచ కార్మికుల దినోత్సవం అసంఘటిత కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. అసంఘటిత కార్మికుల కష్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చాలని సిఐటియు కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం జగపతినగరం గ్రామపంచాయతీ ఆవరణలో ఎర్రజెండా ఎగురవేశి మేడే దినోత్సవాన్ని జరుపుకున్నారు. కిర్లంపూడి మండల సిఐటియు అధ్యక్షుడు టి.జీవా ఆధ్వర్యంలో కార్మికులంతా కిర్లంపూడి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు . ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ వీరబాబు ఉద్యోగ ఉపాధ్యాయ అంగన్వాడీలు ఆశ వర్కర్లు టీం వర్కర్స్ కార్మికులంతా అసంఘటిత కార్మికులైనని వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు చిక్కగాలో అమరులు త్యాగం మరువ లేనిదని నేడు కార్మిక చట్టాలను ప్రజా హక్కులను మోడీ ప్రభుత్వం కావలిస్తే ఉందని విమర్శించారు. పెరుగుతున్న ధరలు తగ్గుతున్న జీవన ప్రమాణాలతో నూటికి 90% గా ఉన్న అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన పాలకులు నడుము మంత్రపు యాత్రికరణలతో ఉపాధి హామీ పథకాన్ని కుదింపుతో ఉన్న ఉపాధిని అరిస్తున్నారు అన్నారు. ఇటువంటి తరుణంలో మేడే స్ఫూర్తితో కార్మికులు కర్షకులు, తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో బివి రమణమ్మ కె శ్రీదేవి వై సుభా రత్నం పి సావిత్రి కిర్లంపూడి మండల యుటియఫ్ ప్రధాన కార్యదర్శి వై వెంకటేష్ అలాగే ఉపాధ్యాయ ఉద్యోగ అంగన్వాడీ ఆశ వర్కర్లు స్కీం వర్కర్లు అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments