రాజవొమ్మంగి తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం భరదనాపల్లి గ్రామ సచివాలయంలో సేవలందించి బదిలీపై వెళుతున్న కార్యదర్శి తాతాజీ సచివాలయం సిబ్బంది ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా పంచాయతీకి ఆయన అందించిన విశేష సేవలను మరిచిపోలేము అని పలువురు కొనియాడారు, భరదనాంపల్లి పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి పంచాయతీ అభివృద్ధికై ఎన్నో సేవలు అందించారని సర్పంచ్ గొల్లపూడి లక్ష్మీ దుర్గ అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ దుర్గ, ఉప సర్పంచ్ సుబ్రహ్మణ్యం, పాశం శేషగిరి, చిర్లం రాజబాబు, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు