కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం లోని కాత్రికి గ్రామ మాజీ సర్పంచ్ చంద్ర తండ్రి శివయ్య అనారోగ్యం తో మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మృతి దేహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ సర్పంచ్ చంద్ర ను పరామర్శించి ధైర్యము చెప్పారు మీకు తెలుగు దేశం పార్టీ, పాలకుర్తి తిక్కారెడ్డి అండగా ఉంటాం అని పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నివాళులు అర్పించిన వారు తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప , రైతు సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, మైనారిటీ అధ్యక్షులు టిపు సుల్తాన్, డాక్టర్ రాజానంద్, సూగురు నాగేష్,కాత్రికి ఈరన్న గౌడ్, బంగారయ్య,సాధికారిక సమితి సభ్యులు సిద్దు, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు,తదితరులు పాల్గొన్నారు.