మెట్టజ్యోతి, రాయవరం : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో దిబ్బ గరువు వద్ద తమలంపూడి వెంకటరామారెడ్డి, గంధావతి దంపతుల ఆధ్వర్యంలో స్థానిక దిబ్బగరువు నందు భారీ ఎత్తున కార్తీకవనసమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.కార్తీక మాసం పురస్కరించుకుని ఉసిరి చెట్టు దగ్గర దేవత మూర్తులను పెట్టి మహిళలు దీపాలు వెలిగించి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అందరికీ ప్రసాదాలు అందజేశారు. ఉసిరి చెట్టు దగ్గర గ్రామస్తులు అందరికి వన భోజనాలు ఏర్పాటు చేశారు. మొదటిగా రెండు తెలుగు రాష్ట్రాల ఓమ్ని హాస్పిటల్ సీఓఓ డాక్టర్ నరేష్, ఓమ్ని హాస్పిటల్ డైరెక్టర్ తమలంపూడి వెంకట రామారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సోమేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు ప్రారంభించి అనంతరం వన సమారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమలంపూడి వెంకట రామారెడ్డి (అబ్బు రెడ్డి)మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసం పురస్కరించుకుని ఉసిరి చెట్టు దగ్గర పూజలు చేస్తే మంచి జరుగుతుంది.నెల రోజులు దీపాలు వెలిగిస్తారని చెట్టు పై మహా విష్ణువు దేవుళ్లు ఉంటారని పెద్దలు చెప్పేవారని ఆనవాయితీగా వస్తుంది అని తెలిపారు. ఉసిరి చెట్టు పై దేవతలు ఉంటారని పూజలు నిర్వాహిస్తే గ్రామంలో మంచి జరుగుతుంది అని అపారమైన నమ్మకం అని తెలిపారు.ప్రతి రోజు దీపాలు వెలిగిస్తే మంచి తో పాటు ఆయుష్షు జ్ఞానము లభించును. వనబోజనాలు ఏర్పాట్లు చేయడంతో క్యాంపు లో పండుగ వాతావరణం నెలకొంది. ఉసిరి చెట్టు దగ్గర పూజాలు చేసి ఉసిరి చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు ఓమ్ని హాస్పిటల్ వైద్య సిబ్బంది, భూమంచిరెడ్డి యూత్ సభ్యులు పాల్గొన్నారు.
కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక వనసమారాధన
RELATED ARTICLES