కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళo మండల కేంద్రం సచివాలయము 1 నందు స్మశానంలో కాటికాపర్లు గుంతలు తీసే వాళ్లను గుర్తించాలని సచివాలయం వన్ నందు బిల్ కలెక్టర్ గారికి మెమొరండం ఇవ్వడమైనది.ఈ సందర్భంగా కెవిపిఎస్ మండల అధ్యక్షుడు మారయ్య తాయప్ప మాట్లాడుతూ గుంతలు తీసే వాళ్ళు ఇదే జీవనాధారం గా పనిచేస్తున్నారు ప్రేమతో ఎంత ఇచ్చిన దాన్ని తీసుకుని కుటుంబము గడపల పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రభుత్వము గుంతలు తీసే వాళ్లకు జీవన ఉపాధి కల్పిస్తూ నాలుగో తరగతి ఉద్యోగస్తులగా గుర్తించాలని డిమాండ్ చేయడమైనది.స్మశాన వాటికలో ము ళ్లుకంపలు కొట్టి , షెడ్లువేసి, కాంపౌండ్ వాల్ నిర్మించి ,నీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య కాటికాపర్ల సంఘం నాయకులు హనుమంతప్ప బసవరాజ్ చిన్న మారయ్య తాయప్ప ఈరన్న నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.