Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లాకళ్యాణం కమనీయం అంగరంగ వైభవంగా 'కోదండరాముని' కళ్యాణం

కళ్యాణం కమనీయం అంగరంగ వైభవంగా ‘కోదండరాముని’ కళ్యాణం

*కళ్యాణం…. కమనీయం
… అంగరంగ వైభవంగా ‘కోదండరాముని’ కళ్యాణం
… కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
… కళ్యాణం చూసి తరించిన భక్తులు*

పెదపూడి, మెట్టజ్యోతి బ్యూరో ప్రసాద్ పలివెల : పంచభూతాల సాక్షిగా ఆకాశమంత పందిరిలో భూదేవంత పీటపై వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిధ్యాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. రాష్ట్రంలోనే రెండవ భద్రాద్రిగా పేరొందిన, నేడు సీమాంద్ర ప్రజల ఏకైక భద్రాద్రిగా కొలుచుకునే కాకినాడజిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడలొ గురువారం కోదండరాముని కళ్యాణం కనులపండువగా జరిగింది. తెల్లవారు జామున తీర్ధపు బిందెతొ స్వామి ఆలయప్రవేశం చేసిన తర్వాత మేలుకొలుపు సేవతొ మొదలై నప్తనదీజలాభిషేకము, పంచామృతాభిషేకము, నిత్యార్చన, మంగళశాసనము (హరతి), అనంతరం భక్తులకు ధర్శనం. గ్రామంలొ గల పవిత్ర కోనేరులొ స్నానం ఆచరించి భక్తులు ముడుపులు, మ్రొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉదయం 8గం.కు ద్వజారోహణం, విశేషహెూమంలు, ఐశ్వర్యసిద్ధికి, మోక్షసిద్ధికి, సకల కార్య సిద్ధికి ప్రత్యేక పూజలు జరిపించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి మఖ్య సలహాదారులు అజయ్ కలాం, కలెక్టర్ కృతికశుక్ల,హిమాన్స్ శుక్లా దంపతులు,అనపర్తి ఎంఎల్ఎ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మీ దంపతులు, సిఐడి ఎస్పీ సరితాదేవి,గ్రామసర్పంచ్ లంకా మున్నీ, మాజీ జడ్పిటిసి సత్తి భగవాన్ రెడ్డి, ద్వారంపూడి ప్రభాకరరెడ్డి(హంస), ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్,వైస్ ఎంపిపి ద్వారంపూడి పద్మావెంకటరెడ్డి (చింతపండు), ఉపసర్పంచ్ మేడపాటి తాతారెడ్డి,ద్వారంపూడి వెంకటరెడ్డి (ఛాంబర్)స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతొ వేదపండితులు స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు స్వామి వారిని కళ్యాణవేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆలయ ధర్మకర్తల ఇంటి నుండి మంచి ముత్యాల తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలు వూరేగింపుగా కళ్యాణ మండపంవద్దకు తీసుకువచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు సంకల్పం ప్రారంభమైనది. అనంతరం 1.45కు జీలకర్ర బెల్లం శిరస్సున ధరింపజేశారు. మధ్యాహ్నం 2 గం.కు బ్యాండుమేళాలు, నృత్యగీతాది మంగళవాయిధ్యాలు, కోలాటములు, తీన్మార్ వాయిద్యములు, బారీ బాణాసంచాకాల్పుల నడుమ శ్రీ కోదండరామచంద్ర మూర్తి వారి ధివ్య కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడింది. ఈ కళ్యాణ కార్యక్రమానికి వ్యాక్యాతగా తాడి శ్రీ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రేజేటి వెంకట కూర్మ రంగనాధాచార్యులు,వెంకట నరశింహాచార్యులు, రామకుమార్, మంజునాధాచార్యులు మాట్లాడుతూ స్వామిని ధర్శించుకుని కోరిన కోరికలు సంవత్సరం లోపునే నెరవేరిన నిధర్శనాలు కొకొల్లలుగా ఉన్నాయని రోజురోజుకి స్వామి మహిమలు తెలుసుకుంటున్న భక్తులు దేశ, విదేశాల నుండి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని తెలిపారు. కళ్యాణ తలంబ్రాలను శిరస్సున ధరించిన వారికి కొద్దికాలంలోనే కళ్యాణం జరుగుతుందని, సంతానంలేని వారికి తలంబ్రాల బియ్యాన్ని క్షీరాణ్ణంగా (పరమాణ్ణం) వండుకుని తిన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం అని ఆయన వివరించారు. అనంతరం కళ్యాణాన్ని తిలకించిన భక్తులకు తలంబ్రాలను ఆలయ కమిటీ అందజేశారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసాదాలను భోజన, వసతి సౌకర్యలను ఏర్పాటు చేసారు. గ్రామంలోని చింతాదొరబాబు యూత్ సభ్యులు, సాయి సేవక్ సభ్యులు భక్తులకు మంచి నీరు, మజ్జిగ, బెల్లం పానకం పంపిణీ చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కాకినాడ డిఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్ , పెదపూడి ఎస్ఐ పి వాసు, సుమారు 80 మంది సిఐలు, ఎన్ఐలు పోలీసు సిబ్బంది బందోబస్తులొ పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలొ ఆధికసంఖ్యలొ గ్రామస్ధులు, భక్తులు పాల్గొన్నారు.కళ్యాణంలో ప్రత్యేక ఆకర్షణ అపర బద్రాద్రి గొల్లలమామిడాడలో నిర్వహించిన శ్రీసీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాల గ్రామానికి చెందిన విలేఖరి కర్రి రామకృష్ణారెడ్డి సమర్పించిన వెండి తలంబ్రాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే పిఈటి ద్వారంపూడి యువరాజారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన కొబ్బరిబొండాలు, బియ్యం గింజలపై వివిధ భాషలలో రాసిన శ్రీరామనామ తలంబ్రాలు, జిల్లా కలెక్టర్ లు కృతికశుక్ల హిమాన్స్ శుక్లాదంపతులు, ఎంఎల్ఎ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిల చేతులమీదుగా శ్రీరామనామాలను స్వామికి సమర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments