
మైనార్టీ బాలుర హాస్టల్ నందు విద్యార్థులే పనిమనుషుల..
చదువుకోవాల్సిన విద్యార్థుల చేత పనిచేయించడం ఎంత వరకు సమంజసం..
(ఆంధ్రన్యూస్)
కర్నూలు నగరంలో ఉన్న మైనారిటీ బాలుర హాస్టల్ నందు పైప్ లైన్ లీక్ అవ్వడం ద్వారా వాచ్మెన్ రిపేర్ చేసిన అనంతరం విద్యార్థుల చేత మూసి వేస్తున్నారు.
వంట గదిలో వంట చేసిన అనంతరం శుభ్రం చేయకుండా వెళ్ళిపోతున్నారని, భోజన శాల చుట్టుపక్కల చెత్తాచెదారంతో మరియు హాస్టల్ చుట్టుపక్కల మురికి కాలువ తెరిచి ఉండడం ద్వారా రాత్రి సమయాలలో విష సర్పాలు రావడం జరుగుతుందని విద్యార్థులు తెలియజేశారు. విద్యార్థులు బస చేస్తున్న వసతి గృహం చుట్టూ కిటికీలు విరిగిపోవడాని గమనించవచ్చు.వసతి గృహం చుట్టూ మురిగినీటితో మరియు చెత్తాచెదారంతో నిండి ఉండడం ద్వారా విష జ్వరాలకు గురవుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు గుర్తించి విద్యార్థులు పరిస్థితిని గమనిస్తారా లేదనేది వేచి చూద్దాం..



