Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాకర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాలతో మహిళల భద్రతకు శక్తి యాప్, వాట్సప్ సేవల పై అవగాహన..

కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాలతో మహిళల భద్రతకు శక్తి యాప్, వాట్సప్ సేవల పై అవగాహన..

(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా ఎస్పీ నేతృతంలో
మహిళల భద్రత కోసం.శక్తి యాప్,శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111.అత్యవసర సమయాల్లో కాల్ చేసినా,మెసేజ్ చేసినా స్పందించేలా శక్తి యాప్,శక్తి వాట్సాప్ నంబర్.మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్,శక్తి వాట్సాప్ నంబర్ల పై పాఠశాలలు,కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ ల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని,విద్యార్ధీనిలకు,మహిళలకు వాటి సేవలను వివరిస్తున్నారని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారు మంగళవారం తెలిపారు.జిల్లాలోని పలు పాఠశాలలు,కళాశాలల్లో,బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు,షాపింగ్ మాల్ లు,ఇతర రద్దీ ప్రదేశాలలో,శక్తి యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల విద్యార్థులకు రక్షణ,భద్రత ఉంటుందని ప్రతి ఒక్కరు శక్తి యాప్ ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శక్తి టీం బృందాలు తెలియజేశారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా డయల్ 112 మరియు SOS బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సాయం అందించేందుకు శక్తి యాప్ పని చేస్తుందని ప్రతి ఒక్క మహిళ,విద్యార్థులు మొబైల్ లో శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసి,రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.శక్తి వాట్సప్ నెంబర్… 7993485111.మహిళలు అత్యవసర సమయాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీసు సేవలను మహిళలకు మరింత చేరువ చేసేందుకు శక్తి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు శక్తి వాట్సప్ 7993485111 నెంబర్ ను మహిళలు,చిన్నారుల భద్రత కోసం సేవ్ చేసుకోవాలన్నారు.మహిళలు శక్తి వాట్సప్ నంబర్ కు కాల్ చేసినా,మెసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకుంటాయని చెప్పారు.24/7 శక్తి వాట్సాప్‌ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.డయల్ -112,181,1098,1930 నెంబర్ల యెక్క ఉపయోగాలు,సోషల్ మీడియా ప్రభావం,చదువుకు ఉన్న ప్రాముఖ్యత,ఈవ్ టీజింగ్,ట్రాఫిక్ రూల్స్,బాల్యవివాహాలు,ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు,వరకట్న వేధింపులు,సైబర్ నేరాలు,మహిళలు,చిన్న పిల్లలపై జరిగే నేరాల గురించి అవగాహన కల్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments