
కరెంటు స్తంభాన్ని గుద్దేసినా చర్యలు తీసుకోని అధికారులు
బిక్కవోలు, ఆంధ్రన్యూస్ : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి పందలపాక రోడ్ లో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ పక్కనే గల ఒక విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టరు ఢీ కొట్టిన ఘటనలో విద్యుత్ శాఖ అధికారులు ట్రాక్టర్ యజమాని పైన గాని, ట్రాక్టర్ డ్రైవర్ పైన గాని చర్యలు తీసుకోకుండా కనీసం కేసులు కూడా పెట్టకుండా వదిలేయడంతో అధికారులకు ముడుపులు ముట్టాయని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం దీనిపై స్పందించేందుకు ఏ మాత్రం చొరవ చూపించడం లేదు దీంతో అక్కడ ప్రజలు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఎస్ఈ, డిఇ లను కలిసేందుకు సమయతమవుతున్నారు ఏది ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోక పోవడంతో ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్తంభాన్ని గుద్దేసి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమానుల పైన, ట్రాక్టర్ డ్రైవర్ పైన, వివిధ శాఖ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



