
బిక్కవోలు, ఆంధ్రన్యూస్ : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఆరిక రేవుల గ్రామంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు అధికారి ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, మరియు నీటి సంఘ సభ్యులు గా మహిపాల స్వామినాయుడు జనసేన పార్టీ నుండి గోపిశెట్టి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. బిక్కవోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు వారిని పూలమాలలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు 

. వీరబాబు మాట్లాడుతూ ఏళ్ల తరబడి రైతులు ఎదురు చూసిన సాగునీటి సంఘాలకు నేడు ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నడూ ఈ దిశగా కనీసం సమీక్షించనూ లేదు.1997లో నీటి సంఘాలకు అంకురార్పణ చేశారు. 1999లో మొదటి ఎన్నికలు జరగ్గా, తర్వాత 2002, 2008, 2015లో జరిగాయి. అందులో 2008లో తప్ప మిగతా మూడు సార్లు చంద్రబాబు సీఎంగా ఉండగానే ఎన్నికలు జరిగాయి. రైతుల అభిప్రాయాలకు విలువ ఇచ్చి ఎన్నికల నిర్వహ ణకు అనువైన పరిస్థితులు సృష్టించలేదు. రెండు పంటలు పండించే గోదావరి జిల్లాల్లో ఈ సంఘాల కీలక పాత్రను ఆనాడు పాలకులు పూర్తిగా మరిచారు. కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో పే సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించటం లో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తేటతెల్లంగా కనబడుతుంది. దీనిలో భాగంగానే శనివారం జిల్లా వ్యాప్తంగా సుమారు 354 నీటి సంఘాలకు ఎన్నికలు జరిపించారు. ఈ కార్యక్రమం లో ఆరికరేవుల గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు సత్యంశెట్టి వీరార్జున్ NDA నాయకులు, కార్యకర్తలు, నీటి సంఘ సభ్యులు పాల్గొన్నారు.



