మెట్టజ్యోతి ఏలేశ్వరం: ఏలేశ్వరం ఎంపీడీవో గా వి అరుణ మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. రాయవరం ఎంపీడీవో గా పదవి బాధ్యతలను నిర్వహిస్తూ బదిలీపై ఏలేశ్వరం వచ్చారు. ప్రస్తుతం ఏలేశ్వరం ఎంపీడీవోగా పదవి బాధ్యత నిర్వహిస్తున్న ప్రతిపాడు ఇన్చార్జి ఎంపీడీవో శ్రీ లలిత సామర్లకోట బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు కార్యాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ నిర్వహిస్తానని అన్నారు. ఎంపీడీవోకు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.
ఏలేశ్వరం ఎంపీడీవో గా అరుణ.
RELATED ARTICLES