Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఅల్లూరి సీతారామరాజు జిల్లాఏపి మంత్రుల ను కలిసిన తెలుగు యువత నాయకులు

ఏపి మంత్రుల ను కలిసిన తెలుగు యువత నాయకులు

ఎటపాక-ఆంధ్ర న్యూస్: ఏపి మంత్రులను ఎటపాక తెలుగు యువత నాయకులు శనివారం కలిశారు.

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులను డోల వీరాంజనేయ స్వామి కలిసి ఏజెన్సీలో గిరిజనులకు మాత్రమే గృహాలు కేటాయిస్తున్నారని, అలాగే గిరిజన ఇతరులకు కూడా గృహాలు కేటాయించాలని కోరారు. వెంటనే స్పందించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.విద్యుత్ శాఖ మంత్రీ గొట్టిపాటి రవికుమార్ ని కలిసి ఎటపాక మండల కేంద్రం లో త్రీఫేస్ లైన్ కావాలని కోరారు.వెంటనే వారు స్పందించి పాడేరు ఎస్సీ తో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసి పోలవరం సమస్యల గురించి భూ ప్యాకేజీ,ఆర్ అండ్ఆర్ ప్యాకేజి ఇప్పించాలని,ఎటపాక నుండి కన్నాయిగూడెంకు ఐదు కిలోమీటర్ల పరిధిలో కరకట్ట మంజూరు చేయాలని కోరారు.దీనికి మంత్రులు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు నలజాల శ్రీకాంత్,అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గడేసుల రంజిత్ కుమార్,ఎటపాక మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు పాటి సంపత్ కుమార్,ఎటపాక మండల ఐటీడీపీ చాంపియన్ బాచినేని శ్రీకాంత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments