. పడాల చారిటబుల్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో తరచుగా విద్యుత్తు అంతరాయంతో చాలా మంది పాఠశాల పిల్లలకు చీకటి పడిన తర్వాత చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇలాంటి టైం లో చదువుకోవడానికి సురక్షితమైన లైటింగ్ అందుబాటులో లేదు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఒక విద్యార్థికి 1 లైట్, హైదరాబాద్, సంస్థ వారు పడాల చారిటబుల్ ట్రస్ట్ (కాకినాడ) వారు కలిసి ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో లాగరాయి & జడ్డంగి ప్రభుత్వ పాటశాలలో చదువుతున్న 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు సోలార్ లైట్స్ ను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పడాల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వెంకట ప్రసాద్, వీరబాబు, పాటశాల ప్రధానోపాధ్యాయులు, పాటశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.