
ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు ప్రతాప్ కుమార్ మాదిగ
ఎంఎస్పి నియోజకవర్గ కో- ఇన్చార్జి తిరుపాల్ మాదిగ
ములకలచెరువు : ఆంధ్రన్యూస్. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ సాధించి, హైదరాబాదుకు తిరిగి వస్తున్న శుభ సందర్భంగా మందకృష్ణ కు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ కు తరలి వెళ్దామని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గం అధ్యక్షులు ప్రతాప్ కుమార్ మాదిగ, ఎం ఎస్ పి నియోజకవర్గం కో ఇన్చార్జ్ తిరుపాల్ మాదిగలు పిలుపునిచ్చారు. ఆదివారం వారు మాట్లాడుతూ
మాదిగల ఆరాధ్య దైవం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పోరాటపటిమతో ఆగస్టు ఒకటవ తేదీన ప్రధాన న్యాయస్థానం సుప్రీం కోర్టులో చంద్రచూడ్ అధ్యక్షతన ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను ఆ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ బి సి డి లుగా వర్గీకరించుకోవచ్చునని ప్రతిష్టాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ నాయకత్వం మాదిగల తో కలసి ఎస్సీ వర్గీకరణ దామాస ప్రకారం ఎస్సీ వర్గీకరణను ఏబిసిడిలుగా చేపట్టి మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగేలా చేయాలని, ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేయడం జరిగింది. ఈ సుదీర్ఘ పోరాటంలో ప్రధానమంత్రి మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల సహాయ సహకారాలతో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతతో పాటు వర్గీకరణ సాధించడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు నుండి మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో ఉంటూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సహాయ సహకారాలు అందించిన పెద్దలందరినీ కలసి, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును తెప్పించి, మాదిగలు మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలను అందించి, ఈనెల 13వ తేదీన ఢిల్లీ నుండి హైదరాబాదుకు విచ్చేస్తున్నారు. ఈ శుభ సందర్భంగా సొంత గడ్డపైకి వస్తున్న మాదిగల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు గానూ, మందకృష్ణ గారితో విజయోత్సవ ర్యాలీ హైదరాబాదులో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు లక్షలాదిగా మాదిగలు తరలి వస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం 6 మండలాల నుండి మాదిగలు గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోవాలని కోరారు…



