ఎస్సీ ఎస్టీ ఆర్థిక స్వానంబల కోసమే ఉన్నతి రుణాలు
కోటనందూరు.
వైయస్సార్ క్రాంతి పథకం ద్వారా ఉన్నతి రుణములు పొందిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని డిపిఎం ఏ కేశవ, ఏపీఎం పి సూర్యకుమారి అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం, మండల పరిషత్ కార్యాలయంలో వైయస్సార్ క్రాంతి పథకం వెలుగు ద్వారా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మండలంలో ఉన్నతి స్కీం ద్వారా 99 మంది లబ్ధిదారులకు 49 లక్షల 50 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంనకు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏపిఎం సూర్యకుమారి మాట్లాడుతూ మండలంలో ఈ ఆర్థిక సంవత్సరం లో మార్చి నెలాఖరుకు 201 మంది లబ్ధిదారులకు ఒక కోటి 50 లక్షలు రుణాలు ఇవ్వాలని అన్నారు.. ఎంపీపీ లగుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కులాలకు అభివృద్ధి కొరకు ఉన్నతి ద్వారా రుణాలు ఇస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయని ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని, ఈ రుణాలను తీసుకొని సకాలంలో తీర్చగలిగితే మిగిలిన లబ్ధిదారులకు కూడా ఇవ్వడానికి ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ లంక ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు కొరుప్రోలు రమణమ్మ కృష్ణ, భీమవరపు కోట సర్పంచ్ జిగటాల వీరబాబు వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.