Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమార్జనకు పాల్పడుతున్న ఇల్లపల్లి సర్పంచ్

ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమార్జనకు పాల్పడుతున్న ఇల్లపల్లి సర్పంచ్

ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమార్జనకు పాల్పడుతున్న ఇల్లపల్లి సర్పంచ్

బిక్కవోలుమే ఆంధ్రన్యూస్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో ఎంఎల్ఎ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పేరు చెప్పి మట్టి మాఫియా సాగిస్తున్నఇల్లపల్లి గ్రామ సర్పంచ్ లొల్ల బద్రం అక్రమంగా పొలంలోమట్టి తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు మీడియా ప్రశ్నించగా అతను చేస్తున్న మట్టి మాఫియాను ఎమ్మెల్యేకి తెలిసే చేస్తున్నామంటూ ఇల్లపల్లి సర్పంచ్ లోల్ల భద్రం మీడియాకు ఫోన్ లో వివరించారు. బిక్కవోలు మండలం ఇల్లపల్లిలో ఎక్కడ మట్టి తవ్వుకొన్నా తన పేరు చెప్పమని ఎంఎల్ఎ తో చెప్పే చేస్తున్నాం అంటూ భద్రం వివరించడం గమనార్హం. స్థానికంగా ఉన్న పొలాలలో నల్ల మట్టిని మట్టి మాఫియా యదేచ్చగా అమ్మకాలు కొనసాగిస్తున్న పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న చందంగా స్థానిక వీఆర్వో వెంకటేష్ వత్తాసు పలకడం హాస్యాస్పదం. స్థానికంగా ఉన్న సొంత ఇల్లు స్థలాలకు పుంత రోడ్లకు మైనింగ్ అధికారుల కళ్ళు కప్పి ఈ మట్టిని విక్రయిస్తూ ఇల్లపల్లి గ్రామ సర్పంచ్ లొల్లబద్రం అక్రమార్జనకు పాల్పడుతున్నారు అంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా మట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతుందని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. అడుగుతుంటే ఊరిలో ఊరిలో తోలుకుంటున్నాం అంటూనే అమ్మకాలు సాగిస్తున్నారు అంటూ ఇక్కడి ప్రజలూ ఆరోపిస్తున్నారు. ఇదే విషయం ఎమ్మెల్యేను వివరణ కోరగా జగనన్న స్థలాలకు తప్పితే అక్రమ మట్టి తీయరాదని స్థానిక ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments