
ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ప్రత్యేక చొరవతో తుమ్మిగనూరులో అభివృద్ధి పనులకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీ మోహన్ రెడ్డి శ్రీకారం.
(ఆంధ్రన్యూస్ కర్నూలు)
మంత్రాలయం నియోజకవర్గం
కోసిగి మండలం పరిధిలోని తుమ్మిగనూరు గ్రామంలో దాదాపు 8.40 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో చేపట్టిన సిసి రోడ్డు పనులకు భూమి పూజ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీ మోహన్ రెడ్డి హాజరయ్యారు.
వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీ రెడ్డి,మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు యంపిపి ఈరన్న,ఈఓపీఆర్డీ అరుణ్ రషీద్,పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ మాలిక్,సర్పంచ్ వారం ఈరన్నతో కలిసి కొబ్బరికాయ కొట్టి, పనులను ప్రారంభించారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీ రెడ్డి మాట్లాడుతూ తుమ్మిగనూరు గ్రామంలో పనులు త్వర త్వరగా ముగించి ఆ పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు జరగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.ఈ సిసి రోడ్డు ప్రారంభం కార్యక్రమంలో గ్రామ పెద్దలు,వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
(ఆంధ్రన్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహం 9640441653)



