Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్.ఈ.ఆర్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్.ఈ.ఆర్

రణస్థలం మండలం, ఆంధ్రన్యూస్ : రణస్థలం మండలంలో సమాజంలోని బలహీన వర్గాల సాధికారతకు కట్టుబాటు కలిగి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సమాజంలోని బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడు తున్న వారు, విధవులు, వికలాంగులు, మరియు ఇతరులు గౌరవంతో కూడిన జీవనాన్ని కలిగి ఉండేలా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, కష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, వారి పింఛన్లను పెంచే చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరిం చుకొని, ఈ రోజు విజయనగరం పార్లమెంట్ సభ్యులు మరియు ఐ.టీ అండ్ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు మరియు ఎమ్మెల్యే శ్రీ న‌డుకుడిటి ఈశ్వర రావు ఎచ్చెర్ల నియోజకవర్గం లోని రణస్థలం మండలానికి చెందిన పతివాడపాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ ద్వారా బలహీన వర్గాల సంక్షేమానికి మరియు సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నం దుకు వారు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ, వికలాంగులు, విధవులు, మరియు వృద్ధులకు ఈ పింఛన్ ఉపశమనం కలిగిస్తుందని, వారి జీవనోపాధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఈ కార్యక్రమం ద్వారా వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి పెంటన్నాయుడు పిసిని జగన్నాథం, రెడ్డి కోటేశ్వరరావు , గొర్లి సాయిదీప్ నా యుడు గారు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments