
(కర్నూలు ఆంధ్రన్యూస్) సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కోసిగికి చెందిన బోయ వీరేష్ రైతు పొలంలో వెళ్లి ఉల్లి పంటను పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య,తాలూకా అధ్యక్షులు ఏం గోపాల్,రైతు సంఘం మండల అధ్యక్షులు పి.తాయన్న మాట్లాడుతూ కోసిగి మండలంలో రైతులు దాదాపు 50% ఉల్లి పంటను రైతులు సాగు చేసుకోవడం జరిగింది.కానీ ఉల్లి పంట కర్నూలు మార్కెట్ కు రాగానే గిట్టుబాటు ధర లేక చాలా తక్కువ ధరకే నూరు రూపాయలు నుంచి 200 రూపాయల వరకు కింటాం ప్రకారము అమ్ముకొని రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది.ఉల్లి ధర పతనమైందన కూటమి ప్రభుత్వం కింటానికి 1200 రూపాయలు ప్రకారము కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది.ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదు ఒక ఎకరానికి లక్ష రూపాయల నుండి 1,50,000 వరకు ఉల్లికి పెట్టుబడి అవుతుంది.కానీ మార్కెట్లో గిట్టు బాట ధర లేదని చాలామంది రైతులు ఉల్లిని పొలంలోనే వదిలి వేయడం జరిగింది.కొంతమంది రైతులు మార్కెట్కు తెచ్చి రోడ్డుమీద పారవేసుకోవడం జరిగింది,ఈ పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతులను ఆదుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.అందువల్ల రైతు సంఘం ఉల్లి రైతులను ఆదుకోవాలని కింటానికి 3000 రూపాయలు ప్రకారము ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుంది.అదేవిధంగా రైతులు చేసిన పెట్టుబడులకు అప్పులు అధిక భారమై కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధికారులు క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలన చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి పూర్తిగా నష్టపోయిన ఉల్లి రైతులను గుర్తించి వారికి పంట నష్ట పరిహారం ఒక ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారము ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.ఖరీఫ్ సీజన్లో వేసిన పత్తి ఒక ఒక కింటానికి 10000 కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతుల గురించి అనేక వాగ్దానాలు చేసి రైతులను ఆదుకుంటామని,రైతులకు అండ దండాలు ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చారు.ఎన్నికలు అయ్యి ఒకటిన్నర సంవత్సరం గడిచిన రైతులు జీవితాలు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు.ఎంతవరకు అమరావతి అభివృద్ధి, విమానాశ్రయం,ఓడరేవులు అభివృద్ధి వాటి గురించే పదేపదే చెప్తున్నాడు కానీ వ్యవసాయము అభివృద్ధి చేద్దామని రైతుల కుటుంబాలను ఆదుకుంటామని ఒక్క మాట కూడా చెప్పడం లేదు.ఏ పంటకు ఎంత పెట్టుబడి అవుతుందన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి గాని,వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుకు గాని అవగాహన లేదు.జిల్లా కలెక్టర్ కు కూడా అవగాహన లేదు వ్యవసాయ అధికారులు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక క్వింటాల్ ఉల్లిని 1200 రూపాయలు ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పారు.కానీ ఉల్లి మార్కెట్లో పోతే రైతులు రోడ్డుపైన వదిలి వచ్చినారు.కావున తక్షణమే ఉల్లి రైతులు గిట్టుబాటు ధర ఒక క్వింటానికి 3000 రూపాయలు ప్రభుత్వమే కొనుగోలు చేసి నష్టపోయిన రైతులకు ఒక ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమలో డిహెచ్పిఎస్ ఓంకార స్వామి ఏఐటియుసి మండల నాయకులు బి.పరుశురాం,రాజసింగం మండల నాయకులు నర్సింలు,చార్లెస్ మరియు ఆ పొలంలో ఉన్న రైతులు వీరేష్ వీరన్న,గుండప్ప వీరితోపాటు మహిళ కూలీలు కూడా పాల్గొన్నారు.



