కౌతాళం ఆంధ్రన్యూస్ కౌతాళం మండలం లోని ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ (ఈరన్న) స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నాగరాజ గౌడ్ ఆదివారం రోజున ప్రమాణ స్వీకారం చేసినారు. వైసిపి ప్రభుత్వ వచ్చి దాదాపు మూడున్నర సంవత్సరాల వరకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా ఎవరిని నియమించలేదు. చివరికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, సీతారాం రెడ్డి, ప్రదీప్ రెడ్డి, ధరణి రెడ్డి వీరు సహకారంతో నాగరాజు గౌడ్ ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ నరసింహ (ఈరన్న) స్వామి కృపతో మరియు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, సీతారామిరెడ్డి, ప్రదీప్ రెడ్డి, ధరణి రెడ్డి సహకారంతో చైర్మన్ గా నియమించినందుకు భీమ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని నాగరాజ గౌడ్ అన్నారు. నా మీద ఎంతో నమ్మకం పెట్టి ఇంత పెద్ద హెూదా కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు . అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినామని అన్నారు. వైసిపి మండలం నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా నాగరాజ గౌడ్ అన్నారు. ప్రమాణ స్వీకారానికి మండలంలోని ప్రతి గ్రామం నుండి వైసిపి కుటుంబ సభ్యులు, ప్రజలు, అభిమానులు మరియు ఇతరులు కృతజ్ఞతలు చెప్పారు ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823