
ఉప్పా ఆశ్రమ పాఠశాలలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్లున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ,
మెట్ట జ్యోతి: హుకుంపేట మండలం.
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల పరిధిలో
బాలికల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండల పరిధిలో గల ఉప్ప, గ్రామంలో గల స్ధానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో రాజ్యాంగం రచించిన అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మరియు హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం ముఖ్య అతిథిలుగా విచ్చేశారు.ముందుగా బాలికలు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి మూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ
వివక్షకు వ్యతిరేకంగా, అసమానతలు, అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన మహావ్యక్తి, భారత రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి స్మరించుకుంటూ ఆయన అడుగు జాడలలో రాజ్యాంగ బద్ధంగా అడుగులు వేయాలని పాఠశాల విద్యార్థిని/విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం చేశారు. అనంతరం హుకుంపేట మండలం జెడ్పీటీసీ రేగం. మత్స్యలింగం మాట్లాడుతూ నేడు మనం కులమతాలకు అతీతంగా జీవనం సాగిస్తున్నామన్న మన హక్కులు చట్టాలను గౌరవిస్తూ స్వేచ్ఛా జీవితం కొనసాగిస్తున్నమంటే దీనికి కారణం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షగా భావించాలని ఎందుకంటే ఆనాడు రాబోయే రోజుల్లో భారతీయులు సంక్షేమంగా వుండాలి కులచిఛ్చులు వాటిల్లకూడదు మనుష్యులు మధ్య వ్యత్యాసం వుండకూడదు భారతీయులు అందరూ కలిసి వుండాలనే తపన తాపత్రయంతో రాజ్యాగం రచించిన ఘనత ఆయనకే చెందుతుందని కనుక మనమందరూ కలిసి మెలిసి అన్నదమ్ములగా అక్క చెల్లెలుగా కులమతాలకు అతీతంగా మనమందరం భారతీయులమే అనే విధంగా సక్రమంగా వ్యవహరిస్తే మన రాజ్యాంగం రచించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వారికి గౌరవం ఇచ్చినట్లని తెలియజేశారు.నేడు అంబేద్కర్ వారి జయంతి వేడుకల్లో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ తో పాటు
హుకుంపేట మండల జెడ్పిటిసి రేగం మత్యలింగం ,
స్థానిక గ్రామ పంచాయతీ సూపర్ సర్పంచ్ పూజారి. సుబ్బారావు స్థానిక గ్రామపంచాయతీ ఉప సర్పంచ్
పాతూని. చంద్రన్న పాత్రుడు , స్థానిక సంయుక్త ఎంపీటీసీ సభ్యురాలు. కిల్లో మీనా .రాపా గ్రామపంచాయతీ సూపర్ ఎంపీటీసీ.కొర్లాబు .వెంకట్, రాఫా గ్రామ పంచాయతీ సూపర్ సర్పంచ్.కొప్పుల లక్ష్మయ్య, ఒల్డా, గ్రామపంచాయతీ సర్పంచ్._
పాంగి సింహాచలం, గ్రామ పెద్దలు వైసిపి నాయకులు.
పెనుమల సత్య రావు,
పెనుమల నారాయణరావు , భూషణ్ రావు,
గ్రామ వార్డు సభ్యులు. దుడ్డు నూకలమ్మ , వన్నెపూరి భవాని,స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. ఉషారాణి మరియు వార్డెన్ ఎస్, శాంతి దేవి
మరియు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ వార్డు వాలంటీర్లు గృహసారథులు వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



